ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి

Published Tue, Dec 31 2024 12:10 AM | Last Updated on Tue, Dec 31 2024 12:10 AM

ఫిర్య

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి

జగిత్యాలక్రైం: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలని ఎస్పీ అశోక్‌కుమార్‌ అన్నారు.జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌ను సోమవారం తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులు పరిశీలించారు. బాధితులు నేరుగా పోలీస్‌స్టేషన్‌లోనే సంప్రదించాలన్నారు. పెట్రోకార్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలన్నారు. నూతన టెక్నాలజీతో కేసులు చేధించాలన్నారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పోలీస్‌స్టేషన్‌కు అనుసంధానం చేసేలా ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌రూంను ప్రారంభించారు. డీఎస్పీ రఘుచందర్‌, టౌన్‌ సీఐ వేణుగోపాల్‌, డీసీఆర్బీ సీఐ శ్రీని వాస్‌, ఎస్సైలు కిరణ్‌కుమార్‌, మన్మథరావు, గీత, మల్లేశం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

నృసింహుడి హుండీ ఆదాయం రూ. 60.87 లక్షలు

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సోమవా రం ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. రూ. 60,87,598 సమకూరినట్లు ఈవో శ్రీనివాస్‌ తెలిపారు. సెప్టెంబర్‌ 25 నుంచి ఈనెల 30 వరకు వచ్చిన ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో 55 గ్రాముల మిశ్రమ బంగా రం, మిశ్రమ వెండి 6.50కిలోలు, 27విదేశీనో ట్లు సమకూరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ సుప్రియ, సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులున్నారు.

రోడ్డు భద్రత చర్యలు తీసుకోవాలి

జగిత్యాల: రోడ్డు భద్రత చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. సోమవా రం కలెక్టరేట్‌లో ఆర్‌అండ్‌బీ, ఎన్‌హెచ్‌–63 అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. అధికారులు ప్రమాద స్పాట్లను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించా రు. హైవే రోడ్‌లో, ఆర్‌అండ్‌బీ రోడ్లపై ప్రమాదాలు జరగకుండా గుంతలు, ప్రమాదకరంగా ఉన్న బావులను పూడ్చివేయాలని ఆదేశించారు. పట్టణంలో స్ట్రీట్‌లైట్లు, సీసీకెమెరాల స్పాట్లను గుర్తించాలని కమిషనర్‌ను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ లత, ఎస్పీ అశోక్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

జూనియర్‌ అసిస్టెంట్ల నియామకం

జగిత్యాల: టీజీ పీఎస్సీ ద్వారా గ్రూప్‌–4 సర్వీస్‌ కింద రెవెన్యూ శాఖలో ఎంపికై న జూనియర్‌ అసిస్టెంట్లకు నియామక పత్రాలను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అందించారు. జిల్లా 21 మంది జూనియర్‌ అసిస్టెంట్లు వచ్చారని, వారందరికీ పోస్టింగ్‌లు ఇచ్చామని పేర్కొన్నారు. నియామకం అయినవారంతా ఆయా రెవెన్యూ కార్యాలయాల్లో రిపోర్ట్‌ చేయాలని సూచించారు.

ఒంటి కాలిపై నిల్చుని ఎస్‌ఎస్‌ఏల నిరసన

జగిత్యాలటౌన్‌: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులు సోమవారం ఒంటికాలిపై నిల్చుని నిరసన వ్యక్తం చేశారు. తమ సర్వీసును క్రమబద్ధీకరించి విద్యాశాఖలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేర కు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి విద్యా శాఖ లో విలీనం చేయాలన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించా రు. కార్యక్రమంలో నాయకులు బర్ల నారాయణ, శ్రీనివాస్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి1
1/3

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి2
2/3

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి3
3/3

ఫిర్యాదుదారులకు సత్వర సేవలందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement