50మంది నిరుపేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ధర్మపురి: నిరుపేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమని ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాంనర్సింహారెడ్డి అన్నారు. ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ మండలంలోని పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కోసం సాయం అందించాలని కోరుతూ ఈ నెల 3న ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. స్పందించిన ఎన్నారైలు, ఇతర దాతలు రూ.2.50 లక్షల విరాళాలు సైకిల్ స్టోర్ నిర్వాహకుల బ్యాంక్ ఖాతాకు పంపించారు. దీంతో రమేశ్ 50 సైకిళ్లను కొనుగోలు చేసి సోమవారం న్యూ టీటీడీ కల్యాణ మండపంలో సీఐ చేతులమీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్సై ఉదయ్‌కుమార్, ఎంఈవో సీతామహాలక్ష్మి, ఎల్‌ఐసీ బ్రాంచ్ మేనేజర్ శుభాకర్, శ్రీకృష్ణ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ఓగుల అజయ్, హెచ్‌ఎంలు శ్రీనివాస్, వెంకటరమణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment