కారు ఢీకొని ఒకరి మృతి
కథలాపూర్(వేములవాడ): కారు ఢీకొని కథలాపూర్ మండలం పోతారానికి చెందిన నాగెల్లి రాజమల్లయ్య (55) మృతిచెందాడు. పోలీసుల కథ నం ప్రకారం.. రాజమల్లయ్య పని నిమిత్తం ఆదివారం కోరుట్లకు బైక్‌పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. దుంపేట శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. రాజమల్లయ్య తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కోరుట్లకు అక్కడి నుంచి జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రాజమల్లయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. రాజమల్లయ్య కుమారుడు కేశవ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
పెగడపల్లి: మండలలోని బతికపల్లికి చెందిన బొమ్మెన రాజయ్య (46) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై రవికిరణ్ కథనం ప్రకా రం.. రాజయ్య కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మందులు వాడినా నయంకావడం లేదు. దీంతో ఈనెల 29న ఇంట్లో క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. రాజయ్య భార్య సత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.
విద్యుత్ ఉచ్చు కేసులో ముగురిపై కేసు నమోదు
మెట్‌పల్లిరూరల్: వన్యప్రాణుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ ఉచ్చు బిగించి ఇద్దరి మృతికి కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మెట్‌పల్లి మండలం రాజేశ్వర్‌రావుపేట గ్రామానికి చెందిన బైరి లక్ష్మీనర్సయ్య గ్రామ శివారులోని తన పంటపొలంలోకి అడవి పందులు రాకుండా ఉండేందుకు పక్కనే ఉన్న మామిడి తోటలో విద్యుత్ ఉచ్చు ఏర్పాటు చేయించాడు. ఆ ఉచ్చుకు తగిలి ఈ నెల 21న అదే గ్రామానికి చెందిన జంగిటి నవీన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఉచ్చు ఏర్పాటు చేసిన చిన్ననర్సయ్యపై కేసు నమోదు చేశారు. కేసు భయంతో చిన్ననర్సయ్య ఆ మరుసటి రోజు ఉరేకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విద్యుత్ ఉచ్చు ఏర్పాటు వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారు లోతుగా విచారణ చేపట్టారు. మరో ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించి.. బైరి లక్ష్మీనర్సయ్య, జంగిటి పెద్దనర్సయ్య, ఓ బాలుడిపై కేసు నమోదు చేశారు. సోమవారం లక్ష్మీనర్సయ్య, పెద్దనర్సయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రెండు ద్విచక్రవాహనాలను సీజ్ చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
స్వగ్రామం చేరిన కార్మికుడి మృతదేహం
మేడిపల్లి: ఆనెల 16న దుబాయిలోని కుర్పకన్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో చనిపోయిన మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన శేరు ఎర్రన్న (53) మృతదేహం సోమవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి మధ్య దహనసంస్కారాలు పూర్తి చేశారు. మృతదేహన్ని స్వగ్రామానికి రప్పించేందుకు గల్ఫ్ స్వచ్ఛంద సేవకుడు గుండెల్లి నర్సింహా ప్రత్యేకంగా కృషి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment