పెగడపల్లి: రాష్ట్రంలో పాల కొరత తీర్చేందుకు ఆడదూడల సంతతి పెంపునకు కృత్రిమ గర్భధారణ చేస్తున్నామని జిల్లా పశువైద్యాధికారి మనోహర్, అస్టిస్టెంట్ డైరెక్టర్ నరేశ్, కరీంనగర్ పశుగణాభివృద్ధి అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్పీ.రెడ్డి తెలిపారు. మండలంలోని బతికపల్లిలో గురువారం పశుగణాభివృద్ధి సంస్థ, పశువైద్య, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో ఉచిత మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు. 184 పశువులకు చూడి పరీక్షలు, గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు. ఆడదూడలు పుట్టేలా సెమన్ రూ.250కు అందుబాటులో ఉందన్నారు. పశుపోషణ, పశుగ్రాస పెంపకం, అధిక పాల దిగుబడి రావడానికి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. మండల వెటర్నరీ అధికారి హేమలత, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, వివిధ మండలాల వెటర్నరీ అధికారులు కిరణ్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్, వేణుగోపాల్, రాకేశ్, వెటర్నరీ అసిస్టెంట్లు, గోపాల మిత్రలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment