వైరస్‌పై జాగ్రత్తలు పాటిద్దాం
జగిత్యాల: హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తిపై ప్రజలు జా గ్రత్తలు తీసుకుంటూ భయాన్ని వీడాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గురువారం ఐఎంఏ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, తుమ్మినా, దగ్గినా చేతి రుమాలును అడ్డు ఉంచుకోవాలని సూచించారు. ఐఎంఏ అధ్యక్షుడు హేమంత్ మాట్లాడుతూ ఈ వైరస్ 2001 నుంచి ఉందని, ఇది శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడే వారికి త్వరగా సోకే అవకాశం ఉందని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఐఎంఏ ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ కోటగిరి సుదీర్‌కుమార్, గైనకాలజిస్ట్ ఒడ్నాల రజిత పాల్గొన్నారు.
నీటి విడుదల చేయండి
జగిత్యాల నియోజకవర్గానికి కాలువల ద్వారా ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. డీ–53 కింద జిల్లాలో ఎక్కువ ఆయకట్టు ఉందని, జోన్–1 ఆయకట్టుకు నీటి సరఫరా నిలిపివేయడం ద్వారా రైతులు ఇబ్బంది పడతారని తెలిపారు. అనంతరం జిల్లాకేంద్రంలోని వైద్య కళాశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర నర్సింహకు వినతిపత్రం అందించారు.
ఎమ్మెల్యేను కలిసిన పంచాయతీరాజ్ శాఖ ఈఈ
జగిత్యాలరూరల్: జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఈఈ లక్ష్మణ్‌రావు ఎమ్మెల్యే సంజయ్‌ను గురువారం కలిశారు. ఆయన వెంట డీఈ మిలింద్, గోపాల్, అశ్విన్ ఉన్నారు.
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment