హెచ్‌ఎంపీవీపై భయం వద్దు
● ముందు జాగ్రత్తలే మేలు
● వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు
● ఆస్పత్రుల్లో సపరేట్ బెడ్లు ఏర్పాటు
● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
జగిత్యాల: చైనాలో విజృంభిస్తున్న హ్యూమన్ మెటా న్యూమో వైరస్ (హెచ్‌ఎంపీవీ)పై ఆందోళన చెందవద్దని, జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రమోద్ కుమార్ అన్నారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. చలి కాలంలో సాధారణంగానే జలుబు, దగ్గు లక్షణాలుంటాయని, నిర్ధారణ కోసం వచ్చేవారికి శాంపిల్స్ తీసుకుంటున్నామని తెలిపారు. వైరస్ వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment