కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు కసరత్తు
మెట్‌పల్లి: జిల్లాలో కొత్తగా మరికొన్ని ప్రాథమిక సహకార సంఘాల(పీఏసీఎస్) ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సంఘాల ద్వారా అందిస్తున్న సేవలను రైతులకు మరింత అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో అవసరమైన చోట కొత్తగా సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక అందించాలని జిల్లా సహకార అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అధికారులు ఆ దిశగా కార్యాచరణను మొదలుపెట్టారు.
జిల్లాలో 51 సంఘాలు..
● జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 51 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి.
● వీటి ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాల విక్రయం, పంట రుణాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర కార్యకలాపాలు సాగుతున్నాయి.
● కొన్ని సంఘాల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండడం.. సంఘ కార్యాలయాలకు దూరంగా ఉండడం వల్ల సేవల్లో జాప్యం జరుగుతోంది.
● దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో ప్రభుత్వం అవసరమైన చోట కొత్తగా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
25 ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు
● జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు కొత్తగా 25 సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు అందినట్లు అధికారులు తెలిపారు.
● మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్, మల్లాపూర్ మండలంలోని పాతదాంరాజ్‌పల్లి, ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండతోపాటు మరో 22 చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలని ప్రస్తుతమున్న సంఘాల నుంచి ప్రతిపాదనలను స్వీకరించారు.
● గడువు ఇంకా ఉండడంతో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
● మరోవైపు వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఎన్నింటిని ఎంపిక చేయాలన్న దానిపై లోతుగా కసరత్తు చేస్తున్నారు.
● కొత్తగా ఏర్పాటు అయ్యే సంఘం పరిధిలో ఎన్ని గ్రామాలు, ఎంత మంది రైతులు, వచ్చే ఆదాయం ఎంత తదితర వాటి గురించి ఆరా తీస్తున్నారు.
● ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదికను అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా మొత్తంగా 25 ప్రతిపాదనలు
రైతులకు అందుబాటులోకి రానున్న సేవలు
ప్రతిపాదనలు వస్తున్నాయి
కొత్త సంఘాల ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 25 వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత జాబితాను ప్రభుత్వానికి అందజేస్తాం. సంఘాల ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
– మనోజ్‌కుమార్, జిల్లా సహకార అధికారి
Comments
Please login to add a commentAdd a comment