ఎకరాకు రూ.20 వేల ఖర్చు
మా మామిడి తోటలో ఇప్పటికే ఎకరాకు రూ.20 వేలు ఖర్చు పెట్టి, అన్ని యాజమాన్య పద్ధతులు పాటించాను. పురుగు మందులు పిచికారీ చేయించాను. గత మూడేళ్లలో పూత లేదు. ఈసారి ఏం చేస్తుందో చూడాలి.
– కాటిపెల్లి శ్రీపాల్ రెడ్డి,
వెంకట్రావుపేట, మేడిపల్లి మండలం
పూత అనుకున్నంత లేదు
మామిడి పూత ఈ ఏడాది కూడా అనుకున్నంత రాలేదు. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాను. వచ్చిన కొద్దిపాటి పూతను తేనె మంచు పురుగు ఆశిస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– నక్కల రవీందర్ రెడ్డి,
అంతర్గాం, జగిత్యాల రూరల్ మండలం
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
తేమ వాతావరణం ఉండటం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం మామిడి పూతపై ప్రభావం చూపుతున్నాయి. అక్కడక్కడ వచ్చిన పూతను తేనె మంచు పురుగు ఆశించినందున రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
– పి.అరుణ్‌కుమార్, హార్టికల్చర్ అసిస్టెంట్
ప్రొఫెసర్, వ్యవసాయ కళాశాల, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment