సాక్షి: హెచ్‌ఎంపీవీపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా..?
డీఎంహెచ్‌వో: వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. సాధారణ వైరల్ ఫీవర్ ఫ్లూ తరహా లక్షణాలే ఉంటాయి. జలుబు, దగ్గు ఉంటాయి. కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాలి.
సాక్షి: వైరస్ ఎక్కువగా ఎవరికి సోకుతుంది..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
డీఎంహెచ్‌వో: 1 నుంచి ఐదేళ్లలోపు పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే 65ఏళ్లు పైబడిన వారికి వ్యాపించే అవకాశం ఉంది. శ్వాసకోశ ఇబ్బందులు, క్యాన్సర్ పేషెంట్స్, ఆస్తమా ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సాక్షి: నిర్ధారణ పరీక్షలు చేసుకోవచ్చా..?
డీఎంహెచ్‌వో: లక్షణాలున్నవారు ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే శాంపిల్స్ సేకరించి హైదరాబాద్‌కు పంపిస్తాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులూ లేవు.
సాక్షి: వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
డీఎంహెచ్‌వో: ఇది కరోనా లాంటిదే. వ్యక్తుల మధ్య దూరం పాటించాలి. ఒకరికొరు చేతులు కలపకూడదు. ప్రతిసారి శానిటైజర్ వాడాలి. పబ్లిక్ ప్లేస్‌లలో ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంటుంది.
సాక్షి: జలుబు, దగ్గు ఉంటే పరీక్ష చేయించుకోవాల్సిందేనా?
డీఎంహెచ్‌వో: శీతాకాలం కావడంతో జలుబు, దగ్గు సాధారణం. చాలారోజుల పాటు తగ్గకుంటే పరీక్షలు చేయించుకోవాలి. వైరస్ ముదిరితే ఇబ్బందులు ఎదురవుతాయి.
సాక్షి: గతంలో ఆక్సిజన్ సిలిండర్లు అందలేదు..? ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారా?
డీఎంహెచ్‌వో: జిల్లా ఆస్పత్రితోపాటు, కోరుట్ల, మెట్‌పల్లి ఆస్పత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పా టు, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని ఆస్పత్రులకు సమాచారం కో సం పోర్టల్ ఏర్పాటు చేశాం. వైద్యులు సమాచా రం ఇస్తుంటారు. తక్షణ చర్యలు తీసుకుంటాం.
సాక్షి : వైరస్ ప్రధాన లక్షణాలేంటి?
డీఎంహెచ్‌వో: ముక్కు కారడం, దగ్గు, కరోనాకు సంబంధించిన లక్షణాలే ఉంటాయి. శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా కలిగిస్తుంది. ఈ వైరస్ సోకిన వారికి వాసన, రుచి లేకపోవడం లాంటివి ఉంటాయి.
సాక్షి: కేసులు పెరిగితే..?
డీఎంహెచ్‌వో: జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం, జనరల్ ఆస్పత్రి, కోరుట్ల ఏరియా ఆస్పత్రి, మెట్‌పల్లిలోని ఆస్పత్రుల్లో సపరేట్ బెడ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం.
సాక్షి: ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తారు?
డీఎంహెచ్‌వో: హెచ్‌ఎంపీవీ వైరస్‌తో భయం లేదు. ప్రజలు ఆందోళన చెందకూడదు. ఆస్పత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. జాగ్రత్తగా ఉండటమే మేలు. జలుబు, ఫ్లూతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండటం. మంచినీరు ఎక్కువగా తీసుకోవడం, పౌష్టికాహారం తినడం చేయాలి. అనారోగ్యంగా అనిపిస్తే ఇంట్లోనే ఉండాలి. తగినంత నిద్రపోవాలి. వైద్యులను సంప్రదించకుండా మందులు తీసుకోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment