ఈ ఏడాది మొక్కల లక్ష్యం 37లక్షలు
పెగడపల్లి: ఈ ఏడాది వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో 37 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించినట్లు డీఆర్డీవో రఘువరన్ తెలిపారు. పెగడపల్లి మండలం రాములపల్లిలో నర్సరీని సందర్శించారు. మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని 380 పంచాయితీల్లో వన నర్సరీలు ఏర్పాటు చేసి ఒక్కో నర్సరీలో సుమారు 12వేల మొక్కలు పెంచుతున్నట్లు తెలి పారు. ఈత, తాటి మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మొక్కలను రక్షించేందుకు షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని తెలి పారు. ఉపాధి హామీలో భాగంగా రూ.18 కోట్లతో సీసీరోడ్లు, మరిన్ని నిధులతో ఫార్మేషన్ రోడ్లు, కంపోస్టు షెడ్లు, ఫాంపౌండ్స్, పుశువుల పాకలు నిర్మాణాలకు నిధులు వెచ్చిస్తున్నామన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఏపీవో అనిల్, పంచాయతీ కార్యదర్శులు శివప్రసాద్, కిరణ్‌బాబు, ఈసీ రమాపతి, టీఏలు నానీ, రాజేశం ఆయన వెంట ఉన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించాలి
డీఆర్డీవో రఘువరన్
Comments
Please login to add a commentAdd a comment