దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు కుమ్మరిపల్లి హెచ్‌ఎం
రాయికల్: మండలంలోని కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కడకుంట్ల అభయ్‌రాజ్ దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈనెల 7న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని తక్కువ ఖర్చు.. ఖర్చులేని బోధనోపకరణలు రూపొందించిన సూపర్‌సైన్స్ కిట్ ద్వారా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించేలా ప్రయోగాలు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకుగాను ఈనెల 21న పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. హెచ్‌ఎంను డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ఎంఈవో రాఘవులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభినందించారు.
వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులు
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మౌంట్‌కార్మెల్ స్కూల్ విద్యార్థి మణిదీప్ ట్రాన్స్‌పోర్ట్ కమ్యునికేషన్ విభాగంలో రూపొందించిన బార్డర్డ్ అలారం ప్రాజెక్ట్, మెట్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన విద్యార్థిని వర్షిత సహజ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా మల్టీపర్పస్ క్రాప్ ప్రొటెక్టర్ ప్రాజెక్ట్ ప్రదర్శించి దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు.
ఘనంగా భరణి నక్షత్ర వేడుకలు
ధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలోని శ్రీయమధర్మరాజుకు గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో శ్రీని వాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఎండిన పసుపునే తేవాలి
మల్లాపూర్: మార్కెట్ యార్డుకు ఎండిన పసుపు తెచ్చి గిట్టుబాటు ధర పొందాలని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మువ్వ గంగారెడ్డి, కార్యదర్శి అపర్ణ అన్నారు. గురువారం మండల కేంద్రంతోపాటు గుండంపల్లిలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పసుపులో నాణ్యత పెంపుదలపై రైతులకు అవగాహన కల్పించారు. పసుపు రైతులు దిగుబడికి సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారని తెలిపారు. పసుపును ఉడకబెట్టి పూర్తిగా ఆరబెట్టిన తర్వాతే మార్కెట్‌కు తెచ్చి మెరుగైన మద్ధతు ధర పొందాలన్నారు. పచ్చి పసుపు అమ్ముకుని నష్టపోవద్దని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్లు వెంకట్, ముజాహిద్, రైతులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
మల్లాపూర్ : ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పో టీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చేలా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఐఈవో నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులు, అధ్యాపకుల హాజరుశాతాన్ని పరిశీలించారు. ఇంటర్‌లోనే విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పర్చుకోవాలని, గమ్యం చేరేవరకూ పట్టుదలతో చదవాలని సూచించారు. కమ్యూనికేషన్, రైటింగ్ స్కిల్స్‌లో పట్టు సాధించాలన్నారు. ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణ, అధ్యాపకులు నంచర్ల రాజేశ్, మహేశ్, సంతోష్, శ్రీనివాస్, నరేష్, రాజేందర్, రజిత, రాజ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment