భూములిస్తే ఉపాధి ఎలా..?
కథలాపూర్(వేములవాడ): మండలంలోని సూరమ్మ ప్రాజెక్టు కుడికాలువకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములివ్వబోమని చింతకుంట రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గురువారం గ్రామంలో రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు గ్రామసభ నిర్వహించారు. కుడికాలువ కోసం గ్రామంలో 24.33 ఎకరాలు అవసరమంటూ అధికారులు సర్వేనంబర్ల వారీగా వివరించారు. దీనికి గ్రామస్తులు మాట్లాడుతూ తమకు ఉన్నదే కొద్ది భూమి అని, ఆ భూమి కాలువ కింద పోతే తమకు ఉపాధి ఎలా అని అధికారులను ప్రశ్నించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, డెప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, నీటిపారుదలశాఖ ఏఈ హుశాల్‌సింగ్, అధికారులు సోహేల్, మురళి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
సూరమ్మ ప్రాజెక్టు కాలువ పనులకు భూములివ్వం
అధికారులకు తేల్చి చెప్పిన చింతకుంట రైతులు
Comments
Please login to add a commentAdd a comment