మందులకు సరిపోవడం లేదు
ఆర్టీసీలో పని చేస్తున్న సమయంలో సంస్థ సూచనతో అధిక పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. కానీ, ప్రస్తుతం రూ.1,140 మాత్రమే వస్తోంది. ఈ డబ్బులు మందులకు కూడా సరిపోవడం లేదు. నాకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఉన్నారు. 21 ఏళ్లు ఆర్టీసీలో పనిచేశా. రిటైరయ్యాక సంస్థ భరోసా ఇస్తుందని ఆశపడితే అలా జరగలేదు. కులవృత్తి చేసుకుంటూ బతుకుతున్న.
– రంగు పండరి, రిటైర్డ్ కండక్టర్, హుజూరాబాద్
ఇద్దరు చనిపోయారు
సుప్రీంకోర్టు తీర్పు మేరకు అధిక పింఛన్ వస్తుందని అప్పు చేసి మరీ ఈపీఎఫ్‌కు లక్షల రూపాయలు చెల్లించినం, ఇప్పటికీ పింఛన్ రావడం లేదు. పూట గడవటం కష్టంగా ఉంది. పట్టణానికి చెందిన అప్పాని రాములు, మొలుగు కొమురయ్య అనే రిటైర్డ్ ఉద్యోలు అధిక పింఛన్ తీసుకోకుండానే అనారోగ్యంతో చనిపోయారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
– వేల్పుల ప్రభాకర్, రిటైర్డ్ కండక్టర్, హుజూరాబాద్
Comments
Please login to add a commentAdd a comment