పరిహారం చెల్లించాలి
ఎన్‌హెచ్–63లో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం దశలవారీగా కాకుండా ఒకేసారి పరిహారం ఇవ్వాలి. విడుతల వారీగా పరిహారం ఇస్తే భూములు కొనుగోలు చేసేందుకు రైతులకు వీలు లేకుండా ఉంటుంది. డబ్బులు వృథా అవుతాయి.
– అంకతి గంగాధర్, రైతు, కల్లెడ
మార్కెట్ రేటు ప్రకారం చెల్లించాలి
బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో నాకున్న రెండెకరాల భూమిలో 27 గుంటలు, బావి పోతోంది. ప్రభుత్వ రేటు సరిపోదు. గ్రామాల్లో కొనసాగుతున్న క్రయవిక్రయాల ప్రకారం పరిహారం చెల్లిస్తే రైతులం భూములు కొనుగోలు చేసుకోవచ్చు.
– చందా రాధాకిషన్, రైతు
అవార్డు విచారణ కొనసాగుతోంది
రహదారి నిర్మాణానికి భూ సేకరణ పూర్తయింది. భూ ములు కోల్పోయిన రైతుల వివరాలు, భూ విస్తరణ వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. అవార్డు విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తి కాగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. – మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల
Comments
Please login to add a commentAdd a comment