రూ.18 కోట్లతో బ్లాక్‌స్పాట్ రోడ్లు
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో రూ.18 కోట్లతో బ్లాక్‌స్పాట్ రోడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. ఇప్పటికే ప్రతి వార్డుకు రూ.2 కోట్లతో సీసీరోడ్లు మంజూరు చేశామన్నారు. వార్డుకు వంద మందికి పైగా పేద, మధ్యతరగతి వారికి డబుల్‌బెడ్‌రూంలు ఇచ్చామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్‌తో విద్యార్థులు వసతులు అందుతాయన్నా రు. ఆయన వెంట చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు బాలె లత, జీవన్, రాము పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పథకాలు వస్తాయని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. గ్రామ సభల్లో పేర్లు రాని వారు ఆందోళన చెందవద్దని, ప్రజలు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సభకు రానివారు మున్సిపల్ కార్యాలయంలోని ప్రత్యేక డెస్క్‌లో దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment