గందరగోళంగా గ్రామసభలు
జగిత్యాల: ప్రభుత్వం అమలు చేయబోయే పలు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు మంగళవారం నుంచి ప్రారంభించిన గ్రామ, వార్డుసభలు పలు చోట్ల గందరగోళంగా సాగాయి. లబ్ధిదారుల ఎంపికకు వారంరోజులుగా క్షేత్రస్థాయిలో చేసిన సర్వే తుది దశకు చేరుకుంది. ఈ నెల 24 వరకు చేపట్టే సభల్లో సర్వేను పరిగణనలోకి తీసుకుని ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హుల వివరాలను ప్రకటించనున్నారు. వారందరికి ఈనెల 26 నుంచి ఆయా పథకాలను వర్తింపచేయడానికి అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. మొదటి రోజు జరిగిన సభల్లో చాలాచోట్ల గందరగోళం నెలకొంది. ప్రజాప్రతినిధు ల ఒత్తిళ్లతో పథకాలకు అనర్హులను ఎంపిక చేస్తున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ము ఖ్యంగా ఇళ్లు ఉన్న వారిని ‘ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రు ల జాబితాలో చేర్చారని మండిపడ్డారు. రైతు రు ణ మాఫీ తమకు రాలేదని పలువురు రైతులు అధి కా రులను నిలదీశారు. మొత్తానికి సభల్లో అనర్హుల ను ఎంపిక చేస్తున్నారని అభ్యంతరాలు వ్యక్తమవుతుండడంతో లబ్ధిదారుల జాబితాను పకడ్బందీ గా రూ పొందించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్
కోరుట్ల: ప్రజాపాలనలో భాగంగా ప్రజలు చేసుకున్న దరఖాస్తుల్లో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తామని, ఇందుకోసం వార్డు, గ్రామ సభలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని రెండో వార్డులో నిర్వహించిన సభలో పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలోని 1, 2, 3, 9, 10, 11, 17, 18, 19, 25, 27, 28 వార్డుల్లో మంగవారం వార్డు సభలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అన్నం లావణ్య, కమిషనర్ బట్టు తిరుపతి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
అర్హులకే పథకాలు
మేడిపల్లి: సంక్షేమ పథకాలకు అర్హులనే ఎంపిక చేస్తామని కలెక్టర్ ప్రకటించారు. మండలంలోని దమ్మన్నపేటలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాల అమలు సరళిని పరిశీలించారు. క్షేత్రస్థాయి సర్వేలో ఎంపిక చేసిన వారి జాబితాను అధికారులు గ్రామసభ ముందు ఉంచారు. ఆ జాబితాను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభ ఆమోదంతో అర్హులకు పథకాలు వర్తింపజేస్తామన్నారు. పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివకర్ రెడ్డి, తహసీల్దార్ వసంత, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment