అంజన్నను దర్శించుకోవడం నా అదృష్టం
● డీజీపీ డాక్టర్ జితేందర్
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని డీజీపీ జితేందర్ అన్నారు. శనివారం కుటుంబసభ్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు డీజీపీ జగి త్యాల జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వా మివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆయనకు పూల మొక్క అందించారు. జిల్లా స్థితిగతులు, శాంతిభద్రతల కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. డీఎస్పీ రఘుచందర్, ఆర్‌ఐ కిరణ్‌కుమార్, మల్యాల సీఐ రవి ఉన్నారు.
ఆభరణాలు, నగదు, ఫోన్లు చోరీ
కథలాపూర్: ఇంట్లో చొరబడిన దుండగులు ఆభరణాలు, నగదు, ఫోన్లు చోరీ చేశారు. బాధితుల వివరాల ప్రకారం.. కథలాపూర్ మండలంలోని భూషణరావుపేటకు చెందిన వెలుగూరి భాస్కర్ ఇంట్లోనే కిరాణం నిర్వహిస్తున్నాడు. చిన్న సెల్‌ఫోన్లు కూడా విక్రయిస్తుంటాడు. శనివారం వేకువజామున ఓ గది తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బీరువాలోని 4 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు, కిరాణంలోని రూ. 35 వేల విలువైన 12 సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఎస్సై నవీన్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment