గర్భస్రావం.. సర్జరీతో తప్పిన ప్రాణాపాయం
● పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను అభినందించిన కలెక్టర్ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: గర్భస్రావం జరిగి, గర్భాశయంలో లీటర్ మేర పేరుకుపోయిన రక్తాన్ని సర్జరీ చేసి, తొలగించారు పెద్దపల్లి మాతాశిశు ఆస్పత్రి వైద్యులు. దీంతో బాధితురాలికి ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన 6 వారాల 2 రోజుల గర్భిణికి గర్భస్రావం జరిగింది. కుటుంబసభ్యులు శనివారం ఆమెను తొలుత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్‌లో పిండం ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయంలోకి చేరలేదని, అక్కడే పెరిగే క్రమంలో పగలడంతో గర్భస్రావమైనట్లు, రక్తం గర్భాశయంలోకి చేరుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు. బాధిత కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించి, పరిస్థితిని వివరించారు. దీంతో వారు సర్జరీ చేస్తామని భరోసా ఇచ్చారు. డాక్టర్ లావణ్య, శౌరయ్య, రవీందర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తదితర సీనియర్ వైద్యుల సమక్షంలో ఆమెకు సర్జరీ చేశారు. లీటర్ వరకు రక్తాన్ని తొలగించి, బ్లీడింగ్ పాయి ంట్‌ని కంట్రోల్ చేశారు. శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, బాధితురాలి ప్రాణాలు కాపాడిన వైద్యులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. స ర్కారు దవాఖానాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని, ప్రజలు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment