రుద్రంగి(వేములవాడ): అతనో పీఎంపీ.. తెలిసీ తెలియని వైద్యం.. నిర్లక్ష్యంతో ఇష్టారీతిన ఇంజెక్షన్లు వేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా డు. అతని నిర్వాకంతో ఇటీవల ఓ వ్యక్తి మృతిచెందగా.. ప్రస్తుతం ఓ బాలికకు సెప్టిక్ అవడంతో కు టుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చే యించారు. బాధితుల వివరాల ప్రకారం.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ బాలికకు చిన్న దెబ్బ తగిలింది. కుటుంబసభ్యులు ఆమెను స్థానికంగా సెప్టిక్‌ల రాజాగా పేరున్న ఓ పీఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అతను టీటీ ఇచ్చాడు. మరుసటి రోజు ఓ నొప్పుల ఇంజెక్షన్ వేశాడు. తర్వాత ఇంజెక్షన్లు వేసిన చోట సెప్టిక్ అయ్యింది. ఉబ్బిపోయి, నొప్పి వస్తోందని బాలిక విలవిలలాడుతుంటే.. చూడమని మళ్లీ ఆ పీఎంపీ వద్దకే తీసుకెళ్లారు. కానీ, అతను తప్పించుకు తిరిగాడు. బాధితురాలికి నొప్పి అధికమవడంతో కోరుట్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆపరేషన్ చేశారు. తమతో ఫోన్‌లో మాట్లాడుతూ.. వస్తానని చెబుతున్న పీఎంపీ రావడం లేదని, ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బాలిక తల్లి జమున తెలిపింది.
వ్యక్తి మృతి.. రూ.4 లక్షలకు బేరసారాలు
ఇటీవల ఇదే పీఎంపీ ఓ వ్యక్తికి ఇంజెక్షన్ ఇచ్చిన చో ట సెప్టిక్ అవడంతో అతను పరిస్థితి విషమించి, మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులకు రూ.4 లక్షలు ఇస్తానని బేరసారాలు చేశాడు. అంత్యక్రియలయ్యాక చేతులెత్తేయడంతో మృతుడి కుల పెద్దలు వచ్చి, పీఎంపీ క్లినిక్ వద్ద ఆందోళనకు దిగా రు. పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.
చర్యలు తీసుకోవాలి..
డబ్బులున్నా లేకున్నా.. అర్ధరాత్రయినా పేషెంట్ల ఇళ్లకు వెళ్లి, వైద్యం చేస్తున్నామని రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలువురు పీఎంపీలు అంటున్నారు. వైద్యంలో తమ పరిధి దాటడం లేదని చెబుతున్నారు. ఇలా నిర్లక్ష్యంగా ఇంజెక్షన్లు వేస్తున్న కొందరు పీఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
బాలికకు దెబ్బ తగిలితే రెండు ఇంజెక్షన్లు వేసిన ఓ పీఎంపీ
రెండుచోట్లా సెప్టిక్
బాధితురాలికి
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్
ఇటీవల ఒకరు మృతి..
రుద్రంగిలో ఘటనలు
Comments
Please login to add a commentAdd a comment