రోగులకు ఇబ్బందులు కలిగించొద్దు
జగిత్యాల: జిల్లా ప్రధాన ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని, సకాలంలో వైద్యం అందించేలా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో పెయింటింగ్ వర్క్స్, టాయిలెట్స్, డ్రెయినేజీ, వాటర్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వంటగది, స్టోర్‌రూం, బియ్యం, ముడిసరుకులు, కూరగాయలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన ఆహారం అందించాలని, ఏమైనా ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కమిషనర్ చిరంజీవి, ఆర్‌ఎంవో సుమన్ పాల్గొన్నారు.
నాణ్యమైన భోజనం పెట్టాలి
సారంగాపూర్(జగిత్యాల): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం బీర్‌పూర్ మండలం మంగెళ గ్రామంలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలన్నారు. భోజన ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. కాగా, పాఠశాల ఆవరణలోని డ్రైనేజీ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మరమ్మతు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మెరుగైన వైద్యసేవలందించాలి
పల్లె దవాఖానల ద్వారా రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బీర్‌పూర్ మండల కేంద్రంలోని పల్లె దవాఖాన సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిష్టర్, రికార్డులు, మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయపాలన పాటించాలని, రోగులకు శుభ్రమైన నీటిని అందించాలని సూచించారు. కార్యక్రమాల్లో ఆర్డీవో మధుసూదన్, డీఈవో రాములు, అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సత్యప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment