పెండింగ్ పనులు పూర్తి చేయాలి
● పసుపు పంటకు గ్యారంటీ రేటు ఉండాలి ● పసుపు బోర్డు కోసం ఎమ్మెల్సీ కవిత ఎంతో కృషి చేశారు ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
మెట్‌పల్లి: పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సూచించారు. చైర్‌పర్సన్ రాణవేని సుజాత అధ్యక్షతన మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పాలకవర్గ చివరి సాధారణ సమావేశం నిర్వహించారు. ముందుగా కౌన్సిలర్లు వార్డుల్లో నెలకొన్న సమస్యలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మొత్తం 40 అంశాలను ప్రవేశపెట్టగా.. వాటికి కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పాలకవర్గం పదవీ కాలం ముగియనుండడంతో చైర్‌పర్సన్, ఇతర కౌ న్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను ఎమ్మెల్యే, అధి కారులు సన్మానించారు.
పసుపుబోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాం
జగిత్యాల: నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు అని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అయితే పసుపు పంటకు గ్యారంటీ రేటు నిర్ణయించాలని సూచించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2014లో అప్పటి ఎంపీగా ఉన్న కవిత పసుపుబోర్డు గురించి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు లేఖ రాశారని, కేరళ, అసోం ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను కలిసి తీవ్రమైన కృషి చేశారని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఏర్పాటుకుముందు స్పైస్ బోర్డు పసుపుబోర్డు కంటే మెరుగైందని చెప్పారని గుర్తు చేశారు. ఎంపీగా అర్వింద్ చేసిందేమీ లేదన్నారు. స్థానిక షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలు పెట్టి అలజడి సృష్టిస్తోందని, రేషన్‌కార్డులు, కులగణన, ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరించిందని, ఇప్పు డు మళ్లీ తీసుకోవడమేంటని ప్రశ్నించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత ఫొటోలను మార్పింగ్ చేయడాన్ని ఖండించారు. ఈ విషయంలో సుమోటోగా స్వీకరించి కేసు పెట్టాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీశ్, కౌన్సిలర్ దేవేందర్‌నాయక్, మల్లేశం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment