గిడుగు స్మారక జాతీయ పురస్కారానికి ఎంపిక
కరీంనగర్ కల్చరల్: కరీంనగర్‌లోని గాయత్రినగర్‌కు చెందిన ప్రముఖ కవి గంప ఉమాపతి గి డుగు రామ్మూర్తి పంతులు స్మా రక జాతీయ పురస్కారానికి ఎ ంపికయ్యారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో అవార్డు అందుకోనున్నారు. సామాజిక అంశంలో.. ఎందుకిలా అనే పుస్తకం రాసిన ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలక్రైం: మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీంలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని మాయమాటలతో ఆఫర్లు పెట్టి ప్రజల నుంచి మొదటగా సభ్యత్వాలు స్వీకరిస్తారని, మరికొంతమందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ.. ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని తెలిపారు. సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్టాగ్రామ్, యూట్యూబ్, లింక్స్, ఈమెయిల్, వెబ్‌సైట్, ఫోన్‌కాల్ ద్వారా ఆకర్షిస్తారని తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మోసపోతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
గల్ఫ్ పంపిస్తానని మోసం.. వ్యక్తికి జైలు
మేడిపల్లి: దుబాయ్ పంపిస్తానని డబ్బులు తీసుకొని, మోసగించిన కేసులో ఓ వ్యక్తికి కోరుట్ల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా పిప్పిరి మండలం బీంగల్ గ్రామానికి చెందిన ఏగోలం మనోజ్‌కుమార్ మేడిపల్లి మండలంలోని రాగోజిపేటకు చెందిన ఆరుగురిని దుబాయ్ పంపిస్తానన్నాడు. వారి వద్ద రూ.40 వేల చొప్పున తీసుకున్నాడు. తర్వాత వారిని దుబాయ్ పంపలేదు. బాధితుల్లో ఒకరైన రాపల్లి నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు కోర్టు సమర్పించినట్లు ఎస్త్సె శ్యాంరాజ్ తెలిపారు. నేరం రుజువు కావడంతో కోర్టు మనోజ్‌కుమార్‌కు మంగళవారం మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.1,000 జరిమానా విధించిందని పేర్కొన్నారు.
బైపాస్ రహదారుల
భూసేకరణకు హైకోర్టు బ్రేక్
మెట్‌పల్లిరూరల్: జాతీయ రహదారి–63 విస్తరణలో భాగంగా చేపట్టే బైపాస్ రహదారుల నిర్మాణానికి భూముల సేకరణపై హైకోర్టు మంగళవారం స్టే విధించింది. బైపాస్ రహదారుల నిర్మాణంతో విలువైన పంట భూములను కోల్పోయి తమకు ఉపాధి లేకుండా పోతుందని, వాటిని నిలిపివేయాలని కోరుతూ వెల్లుల్ల, మేడిపల్లి గ్రామాల రైతులు సార్ల శ్రీనివాస్, పొదేటి రాములు, నాగులపల్లి చిన్న గంగారెడ్డి, పెద్ద గంగారెడ్డి, పుడుకారం నారాయణరెడ్డి, నీలి గంగారెడ్డి, పుప్పాల నర్సయ్య, శ్రీగద్దె బ్రహ్మయ్య న్యాయవాది పోచయ్య ద్వారా హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిశీలించిన కోర్టు భూసేకరణపై స్టే విధించినట్లు న్యాయవాది తెలిపారు. జాతీయ రహదారిని విస్తరించుకోవాలి తప్ప బైపాస్ కోసం భూసేకరణను చేపట్టవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment