షార్ట్‌సర్క్యూట్‌తో సామగ్రి, పత్తి దగ్ధం
బుగ్గారం(ధర్మపురి): షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన ధర్మపురి పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మపురి హనుమాన్ వాడకు చెందిన ఆకుల గంగన్న కుటుంబసభ్యులు ముంబయిలో ఉంటున్నారు. స్థానిక వీరి ఇంట్లో కొంతకాలంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీలు అద్దెకు ఉంటున్నారు. ఇటీవల వారు తమ స్వగ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ జరగడంతో సామగ్రి కాలిపోయింది. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వచ్చి, మంటలు ఆర్పివేశారు.
చొప్పదండి: షార్ట్‌సర్క్యూట్‌తో పత్తి దగ్ధమైన ఘటన చొప్పదండి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని మార్కెట్ రోడ్డుకు చెందిన బండారి బీరయ్య అనే రైతు పత్తిని రేకుల షెడ్డులో నిల్వ ఉంచాడు. మంగళవారం షార్ట్‌సర్క్యూట్ జరగడంతో సుమారు 30 క్వింటాళ్ల పత్తి దగ్ధమైంది. ధరలు పెరుగుతాయని డీ–86 ఉప కాలువ సమీపంలో రేకుల షెడ్డు అద్దెకు తీసుకొని, పత్తి నిల్వ ఉంచామంటూ బీరయ్య దంపతులు రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment