అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు
బుగ్గారం(ధర్మపురి): అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని, ఇందుకోసం గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. మండలంలోని మగ్గిడిఎడపల్లిలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. పలువురి నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను ఎంపిక చేయడానికి గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పేర్లు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి జాబితా తయారు చేస్తారని తెలిపారు. అర్హులైన కుటుంబాలను విస్మరించొద్దని సూచించారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, తహసీల్దార్ కృష్ణచైతన్య, ఎంపీడీవో బి.రవీందర్ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment