● జిల్లాలో పూర్తయిన ‘రైతుభరోసా’క్షేత్ర స్థాయి సర్వే ● ర
జగిత్యాలఅగ్రికల్చర్: పంటల పెట్టుబడికి రాష్ట్రప్రభుత్వం అందించనున్న రైతుభరోసా సాయం కో సం జిల్లాలో చేపట్టిన సాగుభూముల సర్వే సోమవారంతో పూర్తయ్యింది. ఈనెల 15 నుంచి అధి కా రులు రెవెన్యూ గ్రామాల వారీగా వ్యవసాయ శా ఖ సమన్వయంతో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. నివేదికను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించారు. ఇందులో సాగుయోగ్యం కాని భూములు కే వలం 5,088 ఎకరాలుగా గుర్తించారు. అలాగే సా గుకు అనుకూలమైన భూములు 4,75,565 ఎకరా లుగా నిర్ధారించారు. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.285. 33 కోట్ల రైతుభరోసా అందనుంది. సాగుయోగ్యంకాని భూములు తీసివేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.3.05 కోట్లు మిగిలే అవకాశం ఉంది.
సాగు భూములు 4,75,565 ఎకరాలు
జిల్లాలో సాగుకు పనికి రాని భూములు 5088.54 ఎకరాలుగా అధికారులు తేల్చారు. 299 రెవెన్యూ గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించారు. జిల్లాలో మొత్తం భూవిస్తీర్ణం 4,80,653 ఎకరాలు ఉండగా.. సాగుకు ఉపయోగపడే భూమి 4,75,565 ఎకరాలుగా గుర్తించారు. సాగుయోగ్యం భూములను పరిశీలిస్తే... జగిత్యాలలో 178.15 ఎకరాలు, గొల్లపల్లిలో 817.17, కోరుట్లలో 450.25, మల్యాలలో 317.26, కథలాపూర్‌లో 299.04, ఇబ్రహీంపట్నంలో 80.22, కొడిమ్యాలలో 257.28, మెట్‌పల్లిలో 282.31, జగిత్యాల రూరల్‌లో 471.17, ఎండపల్లిలో 233.09, బుగ్గారంలో 140.16, పెగడపల్లిలో 162.09, బీర్‌పూర్‌లో 108.23, మేడిపల్లిలో 91.35, వెల్గటూర్‌లో 231.07, సారంగాపూర్‌లో 81.17, భీమారంలో 192.2, ధర్మపురిలో 162.20, మల్లాపూర్‌లో 201.13, రాయికల్‌లో 333 ఎకరాల చొప్పున ఉన్నట్లు నిర్ధారించారు.
పకడ్బందీగా అధికారుల సర్వే
సాగు భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నెల 26నుంచి రైతుభరోసాను అమలు చేస్తామని ప్రకటించింది. ఈ పథకం కింద ప్రతి సీజన్‌లో ఎకరాకు రూ.6 వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కొండలు, గుట్టలు, రాళ్లు రప్పలు, రియల్ వెంచర్లు, లే అవుట్లు, రోడ్లు, గృహ, వాణిజ్య, మైనింగ్ భూములు, గోదాములు, ఫంక్షన్ హాళ్లు, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించే భూములు, వివిధ ప్రాజెక్టులకు సేకరించిన భూములను అధికారుల క్షేత్రస్థాయి సర్వేలో తొలగించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ రికార్డుల ఆధారంగా, విలేజ్ మ్యాప్‌ల ఆధారంగా, క్షేత్ర స్థాయికి వెళ్లి రైతు భరోసా సర్వే నిర్వహించారు.
వరి పంటకు యూరియా చల్లుతున్న రైతు
ప్రభుత్వానికి నివేదించాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా సర్వే పూర్తి చేశాం. కలెక్టర్ ద్వారా పూ ర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపించాం. జిల్లాలో సాగుకుయోగ్యం కాని వి 5,088 ఎకరాలు ఉన్నట్లు గుర్తించాం.
– రాంచందర్, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment