భూసేకరణ పారదర్శకంగా చేపట్టాలి
జనగామ: జిల్లాలో భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని ఉమ్మడి వరంగల్ ప్రత్యేక అధి కారి, ఆర్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యాన అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేశ్‌కుమార్, సంబంధిత అధికారులతో కలిసి భూసేకరణలో భాగంగా ఆర్‌ఆర్(రిహాబిలిటేషన్–రీసెటిల్మె ంట్) అథారిటీ కింద పెండింగ్ పనులపై సమీక్షించారు. అనంతరం వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని చర్లతండా, సత్యనారాయణపురం గ్రా మాల్లో ఆర్‌ఆర్ సెంటర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూముల చదును పనులను వేగవంతం చేసి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్‌ఘన్‌పూ ర్ నియోజకవర్గం దేశాయ్‌తండాలో కూలీల పెండింగ్‌కు సంబంధించిన 50 శాతం బిల్లుల టోకెన్ నంబర్‌తో వెంటనే నివేదిక సమర్పించాలని ఆర్డీఓకు సూచించారు. ఆర్‌ఆర్‌లోని భూముల ఆమోదా నికి సత్వరమే ప్రతిపాదనలు పంపించి ఇందుకు సంబంధించి హక్కు పత్రాలను ఆన్‌లైన్‌లో నమో దు చేయాలని చెప్పారు. సీసీరోడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు చేసి టెండర్లు పిలవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సమీక్షలో స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓ వెంకన్న, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, సర్వే అండ్ లాండ్స్ ఏడీ మన్యంకొండ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి
వినయ్‌కృష్ణారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment