మాదకద్రవ్యాల వినియోగం నేరం
నర్మెట: మాదకద్రవ్యాల క్రయ విక్రయాలు, వినియోగం నేరమని, యువత చెడు అలవాట్లకు బాని స కావద్దని జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. మండల పరిధి ఆగపేటలో గురువారం ని ర్వహించిన కార్టన్ సెర్చ్‌లో పాల్గొన్న ఆయన మా ట్లాడారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాల ని, ఆన్‌లైన్ లోన్లు, గేమ్స్, బెట్టింగ్స్ జోలికి వెళ్లొద్దని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలను తప్పని సరి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 22 ద్విచక్రవాహనాలతోపాటు కిరాణా షాపుల్లో రూ.5,100 విలువ చేసే మద్యం, రూ.440 విలువైన అంబర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అబ్బయ్య, ఎస్సైలు, ఏఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
మీ సూచనలు.. మాకు ప్రోత్సాహం
ప్రజల సూచనలు, సలహాలు పోలీసు సిబ్బందికి మరింత ప్రోత్సాహం ఇస్తాయని ఏసీపీ పండేరి చేతన్ నితిన్ అన్నారు. పోలీసు సేవలను వివరించే సిటిజన్ ఫీడ్ బ్యాక్ క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను సీఐ అబ్బయ్యతో కలసి స్థానిక పోలీస్ స్టేషన్‌లో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీస్ సిబ్బందిని ప్రజలకు మరింత చేరువచేసిందన్నారు.
జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్
Comments
Please login to add a commentAdd a comment