ముక్కోటికి ముస్తాబు
జనగామ: మానసిక పరివర్తనతో ఆధ్యాత్మిక చింతన, పరమ పురుషార్థకమైన మోక్షం, ఉప వాసాది నియమాలతో రూపుదిద్దుకున్నదే ‘ఏకాదశి’ వ్రతం. ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకునే శుభపర్వ దినం ‘వైకుంఠ ఏకాదశి’. ఈ రోజు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, జాగరణ, జపాలు చేస్తుంటారు. శుక్రవారం(నేడు) తెల్లవారు జాము 4 గంటల సమయంలో భక్తులు ఉత్తర ద్వారం నుంచి వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
ఆలయాలు ముస్తాబు
ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లా కేంద్రం బాణాపురం వేంటేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామి వారిని జనగామ పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాట్లు చేశారు. అలాగే రైల్వేస్టేషన్ ఆవరణలోని చెన్నకేశ్వ ర, లింగాలఘణపురం మండలం జీడికల్ శ్రీ సీతా రాముల ఆలయాలను ముస్తాబు చేశారు.
వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం
తెల్లవారుజాము 4 గంటలకు ముహూర్తం
నేడు వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
Comments
Please login to add a commentAdd a comment