ఏషియన్ పారా త్రోబాల్ పోటీలకు కృష్ణవేణి ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: మొదటి ఏషియన్ పారా త్రోబాల్ చాంపియన్ షిప్ పోటీలకు విశ్వనాథపురం గ్రామానికి చెంది న క్రీడాకారిణి మాచర్ల కృష్ణవేణి(దివ్యాంగురాలు) ఎంపికై ంది. గత ఏడాది డిసెంబర్‌లో కంబోడియా దేశంలో జరిగి న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న ఆమె ఉత్తమ ప్రతిభతో బంగారు పథకాన్ని సాధించింది. ఈ మేరకు సెలక్షన్ కమిటీ ఏషి యన్ పారా త్రోబాల్ పోటీలకు ఎంపిక చేసినట్లు పీటీఎఫ్‌ఐ(పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండి యా) అధ్యక్షుడు డాక్టర్ వి.ఆల్బర్ట్‌ప్రేమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాళ్లు చచ్చుపడినా సడలని సంకల్పంతో సాధన చేసి పోటీల్లో విశేషప్రతిభ చూపిన కృష్ణవేణి ఈ ఏడాది మార్చి 28 నుంచి కంబోడియాలో జరిగే మొదటి ఏసియన్ పారా త్రోబా ల్ పోటీలకు ఎంపికై ంది. ప్రస్తుతం ఆమె కాకతీయ యూనివర్శిటీ కామర్స్ అండ్ బిజినేస్ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేస్తోంది.
కేయూ చెస్ జట్టు ఎంపిక
కేయూ క్యాంపస్: చైన్నె వెల్‌టెక్ యూనివర్సిటీలో ఈనెల 8వ తేదీన ప్రారంభమై 11వ తేదీ వరకు నిర్వహించే సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ (మెన్) జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై.వెంకయ్య గురువారం తెలిపారు. జట్టులో కె.అద్వైత్, టీవీఎన్ దివ్యాంశ, ఎస్.సంజయ్‌చంద్ర, బి.లోకేష్, టి.అరుణ్‌కుమార్, ఎం.ప్రశాంత్ ఉన్నారు. వీరికి వరంగల్ కిట్స్ ఫిజికల్ డైరెక్టర్ ఎస్.మహేష్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని వెంకటయ్య పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment