అలరించిన యువజనోత్సవాలు
హన్మకొండ: హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి కళాశాలలో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి యువజనోత్సవాలు అలరించాయి. కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదపడతాయని అన్నారు. కాగా.. ఈ సందర్భంగా బృంద నృత్యాలు, సంప్రదాయ, శాసీ్త్రయ నృత్య పోటీలు, ఉపన్యాస, క్విజ్, రంగోళి, పేపర్ పెయింటింగ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వారి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేయూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ, వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ హరీందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి ఎ.రజి న్‌కుమార్, ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment