రేపు విద్యుత్ వినియోగదారుల సదస్సు
భూపాలపల్లి అర్బన్: ఈ నెల 19న గణపురం మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు(లోకల్ కోర్టు) నిర్వహించనున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ వేణుగోపాలచారి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు. భూపాలపల్లి, రేగొండ, గణపురం మండలాల వినియోగదారులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాతపూర్వకంగా ఫిర్యాదులు అందించవచ్చని తెలిపారు.
ఐఎన్‌టీయూసీ ప్రధాన
కార్యదర్శిగా రాజేందర్
భూపాలపల్లి అర్బన్: ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పసునూటి రాజేందర్‌ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ప్రకటించారు. ఏరియాకు చెందిన పసునూటి రాజేందర్ 32సంవత్సరాలుగా యూనియన్‌లో పని చేస్తున్నారు. కార్మిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నందున యూనియన్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని యూనియన్‌లో కల్పించినందుకు జాతీయ అధ్యక్ష, కార్యదర్శులు సంజీవరెడ్డి, జనక్‌ప్రసాద్‌లకు రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించడంలో విఫలం
భూపాలపల్లి అర్బన్: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోత్కు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని రావి నారాయణరెడ్డి భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యారంగానికి ఏడు శాతమే బడ్జెట్ కేటాయించి ఎన్నికల హమీని విస్మరించారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో యూనివర్సిటీ కళాశాలకు సొంత భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పోస్ట్‌మెట్రిక్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల విద్యాసంస్థలను నెలకోల్పాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు జోసెఫ్, పవన్, లక్ష్మణ్, రక్షిత, శివ, రాజు, నవీన్ పాల్గొన్నారు.
రెండు నెలలవుతున్నా..
చిట్యాల: మండలకేంద్రంలోని బియ్యం గోదాం వద్ద ఆర్‌అండ్‌బీ అధికారులు పెట్టిన చిట్యాల నేమ్ బోర్డు కూలిపోయి రెండు నెలలు అవుతుంది. ఇంతవరకు ఆ బోర్డును నిలబెట్టిన వారే కరువయ్యారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు నేలకూలిన బోర్డును నిలబెట్టేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
జాతీయస్థాయి
సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక
ఏటూరునాగారం: జాతీయస్థాయి సైన్స్‌ఫెయిర్‌కు జిల్లానుంచి రామన్నగూడెం విద్యార్థులు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని తెలిపారు. ఆదివారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు హర్యానాలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్‌కు జెడ్పీహెచ్‌ఎస్ రామన్నగూడెం పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులు రక్షిత, మైథిలి తయారుచేసిన ఇంటలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టం ఫర్ డ్రైవర్స్ అనే ఎగ్జిబిట్ జాతీయస్థాయికి ఎంపికై ందని చెప్పారు. విద్యార్థుల గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి కొయ్యడ మల్లయ్యను డీఈఓ అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి అప్పని జయదేవ్ మాట్లాడుతూ జాతీయస్థాయికి ఎంపికవడం అభినందనీయమన్నారు. ప్రతిభకు గుర్తింపు లభించిందని గైడ్ టీచర్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment