బుగులోనికి భారీగా భక్తజనం | - | Sakshi
Sakshi News home page

బుగులోనికి భారీగా భక్తజనం

Published Mon, Nov 18 2024 2:33 AM | Last Updated on Mon, Nov 18 2024 2:33 AM

బుగుల

బుగులోనికి భారీగా భక్తజనం

రేగొండ: మండలంలోని తిరుమలగిరి శివారులో జరుగుతున్న శ్రీ బుగులోని వేంకటేశ్వరస్వామి జాతరకు నాలుగో రోజు భక్తులు భారీగా తరలివచ్చారు. వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ఆదివారం వేలాదిమంది వచ్చి మొక్కులు సమర్పించారు. భక్తులు భారీగా తరలిరావడంతో జాతర ఆవరణమంతా భక్తిభావంతో ఉప్పొంగింది. భక్తుల గోవింద నామస్మరణతో గుట్ట మార్మోగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గుట్టపై కొలువుదీరిన వేంకటేశ్వరస్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి జాతరకు హాజరై మొక్కులు చెల్లించారు.

పోలీసుల సేవలు..

జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిట్యాల సీఐ మల్లేష్‌, ఎస్‌ఐ సందీప్‌కుమార్‌ సిబ్బందితో కలిసి బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరలో అడుగడుగునా పోలీసుల సేవలు కనిపించాయి. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూశారు.

జాతర కమిటీ ఏర్పాట్లలో నిమగ్నం

జాతరలో మెదటి రోజు భక్తులు ఇబ్బందిపడడంతో జాతర కమిటీ ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. భక్తుల సౌకర్యార్థం తాగునీటిని ఏర్పాటు చేశారు. జాతర ఈఓ బిల్లా శ్రీనివాస్‌, చైర్మన్‌ రొంటాల వెంకటస్వామి, కమిటీ సభ్యులు రమణారెడ్డి, విజేందర్‌, రాజేందర్‌, శ్రీధర్‌, శివ, తిరుపతి ఏర్పాట్లను పరిశీలించారు.

కిటకిటలాడిన స్వామి సన్నిధి

జాతర ప్రాంగణంలో విడిది

No comments yet. Be the first to comment!
Add a comment
బుగులోనికి భారీగా భక్తజనం1
1/2

బుగులోనికి భారీగా భక్తజనం

బుగులోనికి భారీగా భక్తజనం2
2/2

బుగులోనికి భారీగా భక్తజనం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement