కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ
కాళేశ్వరం: కార్తీకమాసం ఆదివారం సెలవు కావడంతో కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద పూజలు చేసి దీపాలు వెలిగించారు. లక్షముగ్గులు వేసి లక్షవత్తులు వెలిగించి దీపారాదన చేశారు. బ్రాహ్మణోత్తములకు దీపదానాలు చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేశారు. సామూహిక దీపాలంకరణ నిర్వహించారు. దీపాలంకరణలో పాల్గొన్న భక్తులకు పసుపు, కుంకుమ, అక్షింతలు అందజేశారు. దీంతో ఆలయంతో పాటు గోదావరి తీరం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం వివిధ పూజలు, లడ్డూప్రసాదాల ద్వారా రూ.4.25లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు త్రిపురారి కృష్ణమూర్తిశర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment