పరిపాలనా సౌలభ్యమేది? | - | Sakshi
Sakshi News home page

పరిపాలనా సౌలభ్యమేది?

Published Mon, Nov 18 2024 2:33 AM | Last Updated on Mon, Nov 18 2024 2:33 AM

పరిపా

పరిపాలనా సౌలభ్యమేది?

పేరుకే కొత్త మండలాలు

పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని

ప్రభుత్వ కార్యాలయాలు

ఉమ్మడి మండలాల నుంచే

కార్యకలాపాలు

ఇబ్బంది పడుతున్న ప్రజలు

సేవలు అందడం లేదు

పలిమెల మండలం ఏర్పాటు జరిగి ఎనిమిదేళ్లు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖల సేవలు అందడం లేదు. కేవలం పోలీస్‌స్టేషన్‌ మినహా ఏ కార్యాలయం స్థానికంగా లేదు. ఏదైనా అవసరం పడితే పాత మండలమైన మహదేవపూర్‌లోని కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతుంది. మండల కేంద్రంలో అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.

– జనగామ శ్రీనివాస్‌, పలిమెల

పాత మండలానికే

వెళ్లాల్సి వస్తోంది..

రెండేళ్ల క్రితం కొత్తపల్లిగోరి మండలంగా ఏర్పాటైనందుకు చాలా సంతోష పడ్డాం. రేగొండ మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే శ్రమ తప్పుతుందని అనుకున్నాం. కానీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా మండలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయలేదు. ఏదైనా పని కోసం రేగొండకు వెళ్లాల్సి వస్తోంది.

– దండెబోయిన సంతోష్‌, గాంధీనగర్‌

కాటారం: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి కొత్త మండలాలు పేరుకే పరిమితమయ్యాయి. మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రాలేదు. ఒకటి, రెండు కార్యాలయాలు మినహా మిగితా ఏ కార్యాలయాల ఏర్పాటు నూతన మండలాల్లో జరగకపోవడంతో ప్రజలకు పరిపాలనా సౌలభ్యం జరగడం లేదు. అంతకుముందు ఉన్న మండలాల నుంచే పాలన సాగుతోంది.

పలిమెల మండల పరిస్థితి..

ఎనిమిదేళ్ల క్రితం ఏర్పడిన పలిమెల మండలంలో రెండేళ్ల కిందట పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేశారు. మండలం ఏర్పాటు జరిగిన వెంటనే ఆయా ప్రభుత్వ శాఖలకు సంబంధించి హుటాహుటిన అధికారులను కేటాయించారు. కొంత కాలానికి పలిమెల మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రెవెన్యూ, పంచాయితీరాజ్‌, వ్యవసాయశాఖలను కలుపుకొని మండల సమీకృత భవనం ఏర్పాటు చేశారు. భవనం ప్రారంభించినప్పటికీ ఏ ఒక్క రోజు ఆ భవనంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగలేదు.

కొత్తపల్లిగోరి మండల పరిస్థితి..

కొత్తపల్లిగోరి రెవెన్యూ కార్యాలయాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు లాంఛనంగా ప్రా రంభించారు. ఆ తర్వాత పాఠశాల భవనంలో తా త్కాలిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ఏర్పాటుచేశారు. ఇటీవల మండలానికి వ్యవసాయశాఖ అధికారిని కేటాయించారు. మండలం ఏర్పా టు జరిగిన రెండేళ్లు గడుస్తున్పప్పటికీ పలు ప్రభు త్వ శాఖల మండల స్థాయి అధికారుల కేటాయింపు కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు గానీ ఏర్పాటు కాలేదు. సమీకృత భవనానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి మండలాల నుంచే పరిపాలన..

2016లో అప్పటి ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటు చేసింది. మహదేవపూర్‌ మండలంలో భాగమైన పలిమెలను, చిట్యాల మండలంలో భాగమైన టేకుమట్లను నూతన మండలాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన డిమాండ్‌తో 2022లో రేగొండ మండలం నుంచి కొత్తపల్లిగోరిని మండలంగా ఏర్పాటు చేశారు. నూతన మండలాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నప్పటికీ పరిపాలన మొత్తం ఉమ్మడి మండలాల నుంచే కొనసాగుతుంది. పలిమెల మండలానికి మహదేవపూర్‌లో, కొత్తపల్లిగోరి మండలానికి రేగొండలో, టేకుమట్లకు చిట్యాలలో నుంచి పాలన సాగుతోంది.

జిల్లా వివరాలు..

రెవెన్యూ డివిజన్లు 2(భూపాలపల్లి, కాటారం)

మండలాలు 12

నూతన మండలాలు 3 (పలిమెల, టేకుమట్ల, కొత్తపల్లిగోరి)

పలిమెల మండలం వివరాలు

గ్రామపంచాయతీలు 08

రెవెన్యూ గ్రామాలు 17

టేకుమట్ల మండలం వివరాలు

గ్రామపంచాయతీలు 24

రెవెన్యూ గ్రామాలు 18

కొత్తపల్లిగోరి మండలం వివరాలు

గ్రామపంచాయతీలు 14

రెవెన్యూ గ్రామాలు 7

టేకుమట్ల మండల పరిస్థితి..

2016న టేకుమట్ల మండలం ఏర్పాటు జరిగింది. చిట్యాల మండలం నుంచి విడిపోయి టేకుమట్లగా ఏర్పాటు జరిగింది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మండల తహసీల్దార్‌ కార్యాలయం, గ్రామపంచాయతీలో ఎంపీడీఓ కార్యాలయం, ఉపాధి హామీ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఓ కార్యాలయం రైతువేదికలో ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. పోలీస్‌స్టేషన్‌కు మినహా ఏ ప్రభుత్వ కార్యాలయానికి సొంత భవనం లేదు. మండల కేంద్రంలో ఏడాది క్రితం ప్రారంభించిన తహసీల్దార్‌ కార్యాయం, ఎంపీడీఓ కార్యాలయం పనులు శంకుస్థాపనకే పరిమితమయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
పరిపాలనా సౌలభ్యమేది?1
1/3

పరిపాలనా సౌలభ్యమేది?

పరిపాలనా సౌలభ్యమేది?2
2/3

పరిపాలనా సౌలభ్యమేది?

పరిపాలనా సౌలభ్యమేది?3
3/3

పరిపాలనా సౌలభ్యమేది?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement