తేమ శాతం 17 ఉంటే కొనాలి
భూపాలపల్లి: తేమ శాతం 17 ఉంటే ఎలాంటి జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. బుధవారం అదనపు కలెక్టర్ చాంబర్‌లో పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ, పీఏసీఎస్ సీఈఓలతో కొనుగోలు కేంద్రాల రిజిస్ట్రేషన్, ట్యాబ్‌లో నమోదులు, కొనుగోలు ప్రక్రియ, కొనుగోలు కేంద్రాల్లో రిజిష్టర్ల నిర్వహణ, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు, పరికరాలు తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం పూర్తిగా ఆరబెట్టిన తర్వాతనే తేమ శాతం కచ్చితంగా ఉన్న ధాన్యం కొనుగోలులో ఆలస్యం చేయొద్దని సూచించారు. రైతులు కల్లాల వద్దనే అరబెట్టి తేమ శాతం వచ్చిన తరువాత కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ అధి కారులు అవగాహన కల్పించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల సంస్థ డీఎం రాములు, మా ర్కెటింగ్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment