నియామకం
కాళేశ్వరం: మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త కొరిపల్లి ప్రశాంత్ జాతీయ మానవహక్కుల మండలి ఎన్జీఓ తెలంగాణ నార్త్‌జోన్ అధ్యక్షుడిగా బుధవారం ఎన్నికయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన మానవహక్కుల మండలి ఎన్జీఓ జాతీయ అధ్యక్షుడు అయిలినేని శ్రీనివాస్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నార్త్‌జోన్‌లోని ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మా నవహక్కులపై చైతన్యం చేసి, హక్కుల ఉద్యమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment