నేరాల నియంత్రణకు కృషి
రేగొండ: నేరాల నియంత్రణకు కృషి చేయాలని, శాంతి భద్రతలు కాపాడాలని డీఎస్పీ సంపత్‌రావు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రేగొండ పోలీస్‌స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు. నమోదైన కేసుల వివరాలు తెలుసుకుని పెండింగ్ వాటిపై దృష్టి సారించాలన్నారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవాంచనీయ ఘటనలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా ఖచ్చితమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళల్లో ప్రత్యేకంగా పెట్రోలింగ్ చేపట్టాలని చెప్పారు. ప్రజా ఫిర్యాదులో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సీఐ మల్లేష్, రేగొండ, ఎస్సై సందీప్‌కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
డీఎస్పీ సంపత్‌రావు
Comments
Please login to add a commentAdd a comment