లైంగికదాడి నిందితుడి అరెస్ట్
పలిమెల : మండలంలోని ఓ గ్రామంలో మహిళ బహిర్భుమికి వెళ్లే సమయంలో ఆమైపె లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పలిమెల పోలీసులు అరెస్ట్ చేసినట్లు మహదేవ్‌పూర్ సీఐ కె.రామచందర్‌రావు తెలిపారు. గురువారం పలిమెల పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామచందర్‌రావు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనపై సోమవారం రాత్రి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు.. నిందితుడు సర్వాయిపేటకు చెందిన రాజం సమ్మయ్యను అరెస్ట్ చేసి గురువారం భూపాలపల్లి కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలిమెల ఎస్సై తమాషారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఒకరికి గాయాలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాకేంద్రంలోని మంజూర్‌నగర్‌లో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్పూరులోని కేటీపీపీ క్యాంటీన్‌కు కూరగాయలు రవాణా చేసే హోమిని వాహనం చెల్పూరు వైపునకు వెళ్లోంది. ఇదే సమయంలో భూపాలపల్లి పట్టణం భాస్కర్‌గడ్డకు చెందిన చింతల రాంబాబు తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం చెల్పూరు వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో హోమిని వాహ నం అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని వెనుకనుంచి ఢీకొంది. దీంతో హోమిని వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా.. ద్విచక్ర వాహనదారుడు రాంబాబు కిందపడిపోగా కాలుకు గాయమైంది. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చి క్షతగాత్రుడుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment