పోలీస్‌స్టేషన్ తనిఖీ
భూపాలపల్లి అర్బన్: వార్షిక తనిఖీలో భాగంగా భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌ను డీఎస్పీ సంపత్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కనాటి సిబ్బందితో మాట్లాడారు. సరైన పద్ధతిలో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష చేసి కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. విసిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేసి, అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డ్ నిర్వహణ, సీసీటీఎన్‌ఎస్, రిసెప్షను, కోర్టు డ్యూటీ, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు మొదలుగు విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్‌కుమార్, ఎస్సైలు సుధాకర్, రమేష్, హోంపాల్, శ్రీలత సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment