ఉద్యోగ భద్రత కల్పించాలి
భూపాలపల్లి రూరల్: ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, ఫిక్స్‌డ్ వేతనం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆశ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో డిసెంబర్ 15న ప్రారంభించిన ఆశ వర్కర్ల బస్సు జాత యాత్ర శుక్రవారం భూపాలపల్లికి చేరుకుంది. యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుంచి బోనాలు, కోలాటంతో ర్యాలీగా అంబేడ్కర్ సెంటర్‌కు చేరుకొని అంబేడ్కర్‌కు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జయలక్ష్మి మాట్లాడారు. ఆశవర్కర్లకు రూ.18వేల వేతనం అందించాలన్నారు. అధికారంలోకి రాగానే ఆశవర్కర్ల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కొండా లక్ష్మి, ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్, నాయకులు ఆకుదారి రమేష్, వంగాల లక్ష్మి పాల్గొన్నారు.
ఆశ వర్కర్స్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment