దీక్షాంత్ పరేడ్ రద్దు..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో శుక్రవారం మామునూరు టీజీఎస్పీ 4వ బెటాలియన్‌లో జరగాల్సిన దీక్షాంత్ పరేడ్ రద్దయింది.
– 10లోu
వ్యవసాయ పనులు
చేయలేకపోతున్నాం..
రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి శివారులో పెద్దపులి సంచరించినట్లు పాదముద్రల ఆనవాళ్లు ఉన్నాయి. వ్యవసాయ పనుల కోసం శుక్రవారం ఉదయం వచ్చిన కూలీలు, రైతులు తిరిగివెళ్లారు. రుద్రగూడెం, కొండాయిల్‌పల్లి మధ్య పంటపొలాల్లో ఉన్న పలుగు ఏనలో పెద్దపులి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు సందేహం వ్యక్తం చేశారు. పులి ఉన్నట్లు గుర్తిస్తే అటవీ ప్రాంతానికి పంపించే చర్యలు అధికారులు చేపట్టాలి.
– బుర్ర రాఘవరెడ్డి, రైతు, రుద్రగూడెం
అప్రమత్తంగా ఉండాలి
పులులు సంచరించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రెండు రోజులు వ్యవసా య పనుల కోసం పంట పొలాలు, బయటకు వెళ్లొద్దు. గ్రామస్తులు, రైతులు, గొర్రెలకాపరులు జాగ్రత్తగా ఉండాలి. పంటలను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేయవద్దు. పులి తిరిగి వెళ్లిపోతుంది. ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం అందించాం.
– రవికిరణ్, ఎఫ్‌ఆర్‌ఓ, నర్సంపేట
●
Comments
Please login to add a commentAdd a comment