ఆర్థికవేత్త, సంస్కరణల సారథి
భూపాలపల్లి రూరల్: ఆర్థికవేత్త, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్ పేరు ప్రఖ్యాతలు పొందారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన ఆర్థిక చాణక్యుడు మన్మోహన్ సింగ్ అని, అతని మరణం దేశానికి తీరని లోటని చెప్పారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల గురువారం భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు దేవన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతాప సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విలక్షణ పార్లమెంటేరియన్‌గా దేశానికి మన్మోహన్ సింగ్ సేవలందించారని తెలిపారు. వారి జీవితంలో ఎన్నో కీలక పదవులు అధిష్టించిన ఆయన సామాన్య జీవితం గడిపారని చెప్పారు. మన్మోహన్ సింగ్ నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చి గొప్ప ఆర్థికవేత్తగా ఎదిగారని తెలిపారు. వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేసిన ఆయన దేశ ఆర్థిక విధానంపై బలమైన ముద్రవేశారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కౌన్సిలర్లు, దాట్ల శ్రీనివాస్, ముంజాల రవీందర్, పీసీసీ సభ్యుడు మధు, పార్టీ నాయకులు బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్, శ్రీనివాస్, సాంబమూర్తి, వెంకటస్వామి, పృథ్వీ, మహేష్ పాల్గొన్నారు.
మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించిన
ఎమ్మెల్యే గండ్ర
Comments
Please login to add a commentAdd a comment