● క్షేత్రస్థాయిలో కనిపించని మార్పు
● పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ఇబ్బందులు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో మాతాశివు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అక్కడక్కడ సంభవిస్తూనే ఉన్నాయి. ఉన్నతాధికారులు ఎన్ని రకాలుగా సమీక్షలు నిర్వహించి వైద్యులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నా, హెచ్చరిస్తున్నా ఏదో ఒక చోట ప్రసవ సమయంలో మరణం సంభవిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచుతూనే మాతాశిశు మరణాల నివారణకు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గర్భిణుల వివరాలు ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలకు తీసుకెళ్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ గర్భిణుల పేర్లు నమోదు చేయించి అవసరమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. నిత్యం వైద్య పరీక్షలతో పాటు రక్తహీనత, బీపీ, మధుమేహం, గుండె సంబంధిత 2డీ ఎకో పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించేలా చర్యలు తీసుకుంటున్నా కొందరు ప్రసవం తర్వాత మృత్యువాత పడుతుండడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment