వైద్యారోగ్య కార్యక్రమాలు విస్తృతం
భూపాలపల్లి అర్బన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది ప్రభుత్వ వైద్యసేవలపై నమ్మకం కలిగే విధంగా వైద్యారోగ్య కార్యక్రమాలు విస్తృతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం జిల్లాలోని వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని, గూగుల్ టైం పాండ్ ఫొటోలను అందరూ గ్రూపులో పెట్టాలని సూచించారు. ఆస్పత్రులకు వచ్చి రోగులకు సరైన చికిత్స అందించి నమ్మకాన్ని పెంపొందించాలని తెలిపారు. సాధారణ కాన్పులపై అవగాహన కల్పించాలన్నారు. ఐఎంఆర్, ఎంఎంఆర్ రేటును తగ్గించాలన్నారు. చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వందశాతం వేయాలని ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని, క్షయ వ్యాధిని నమోదు చేయడంలో వెనకబడి ఉన్నామన్నారు. ఇది పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎన్‌సీడీ, డయాబెటిక్ హైపర్టెన్షన్ కేసులను గుర్తించి వారికి క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. పాలిటివ్ కేర్ పేషెంట్ వద్దకు వెళ్లి ఏ విధంగా సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. 104, 108 సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, ఉమాదేవి, ప్రమోద్‌కుమార్, డెమో శ్రీదేవి, డీపీహెచ్‌ఎన్ శౌరిల్లమ్మ, ఫార్మసిస్టులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మధుసూదన్
Comments
Please login to add a commentAdd a comment