వాతావరణం
జిల్లాలో ఉదయం పొగమంచు కురుస్తుంది. మధ్యాహ్నం కాస్త ఎండగా ఉంటుంది. రాత్రివేళ చలితో పాటు మంచు పడుతుంది.
రోడ్డు భద్రతా
నియమాలు పాటించాలి
చిట్యాల: రోడ్డు భద్రత నియమాలను ప్రతీ ఒక్కరు పాటించాలని ఆర్టీఓ సంధాని అన్నా రు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్సై జి.శ్రావన్‌కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా ఆర్‌టీఓ సంధాని హాజరై మాట్లాడారు. విద్యార్థులు తమ భవిష్యత్‌ను చక్కగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. డ్రైవింగ్ చేసే ప్రతి విద్యార్థికి తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని పేర్కొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసిన వారికి, ఇచ్చిన వారికి ఆరు నెలలు జైలు శిక్ష ఉంటుందని అన్నారు. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ తిరస్కరించనున్నట్లు చెప్పారు. పది వేలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు రోడ్డుపై జనాల మధ్యలో రాష్ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్‌చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను పా టించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యా ల ఎస్సై శ్రావన్‌కుమార్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.శ్రీదేవి, పోలీస్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నేడు కాళేశ్వరంలో
సమావేశం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం కాన్ఫరెన్స్‌హాల్‌లో శుక్రవారం ఉదయం 11గంటలకు దేవదాయశాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్‌శర్మ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం దేవస్థానం అభివృద్ది పనులు, కుంభాభిషేకం, సరస్వతినది పుష్కరాలపైన సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాస్థాయి సంబంఽధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment