సూచనలివే.. | - | Sakshi
Sakshi News home page

సూచనలివే..

Published Thu, Jan 9 2025 1:41 AM | Last Updated on Thu, Jan 9 2025 1:41 AM

-

● పరీక్షలు అంటే భయం ఉండకూడదు. సమయాన్ని వృథా చేయకుండా సబ్జెక్టుల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

● సిలబస్‌ పూర్తయ్యిందని ఇంటి వద్దే ఉండొద్దు. తరగతులకు హాజరైతే పునఃశ్చరణ, సందేహాల నివృత్తి జరుగుతుంది. స్టడీఅవర్స్‌లో ప్రత్యేక శ్రద్ధతో చదువుకునే అవకాశం పాఠశాలల్లో,కళాశాలల్లో ఉంటుంది

● పాత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేస్తే పరీక్ష పద్ధతులు తెలుస్తాయి.

● పిల్లలు చదువుతున్నారా లేదా అని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. వారి చదువుకు సహకరించాలి.

● ఆత్మవిశ్వాసం పెంచడం.. ఒత్తిడి లేకుండా పిల్లలను ప్రోత్సహించి, వారి ప్రగతిని ప్రశంసించడం.

● భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మ్యాథ్‌మెటిక్స్‌లోని భావనలు నేర్చుకోవడం.

● సూత్రాలు, సిద్ధాంతాలు అవగాహన: ముఖ్యమైన సిద్ధాంతాలను బాగా అర్థం చేసుకోవడం.

● ప్రయోగాలు, పటాలు, ఉదాహరణలు, అప్లికేషన్లు ప్రాక్టీసు చేయాలి.

● విద్యార్థులు చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement