రచనలతో సామాజిక చైనత్యం
భూపాలపల్లి రూరల్/ భూపాలపల్లి అర్బన్: సామాజిక చైతన్యం కోసం రచనలు అవసరమని, గడ్డం లక్ష్మయ్య ఆధునిక భావాలను వివరిస్తూ శతకగ్రంథం రాయడం అభినందనీయమనీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి మంజూరునగర్‌లోని ఇల్లందు క్లబ్‌లో జయశంకర్ సారస్వత సమితి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పుస్తకావిష్కణ కార్యక్రమానికి ముఖ్యఅతిథి ఎమ్మెల్యే హాజరయ్యారు. శ్రీమహాసరస్వతీ శతక పుస్తకావిష్కరణ అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. సామాజిక చై తన్యం కోసం కవులు, రచయితలు రచనలు చేయ డం అభినందనీయమన్నారు. సమాజంలో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులు, అభివృద్ధిపై రచయితలు, కవులు రచనలు చేయాలని విజ్ఞప్తి చేశా రు. యువతరం రచన, సాహిత్య రంగాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఇది మున్ముందు పెద్ద ప్ర మాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. యువత సాహిత్యంపై ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే సూ చించారు. సమాజానికి ఉపయోగపడే రచనలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి యువతకు అందుబాటులో ఉండే విధంగా సాహితీవేత్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గడ్డం లక్ష్మయ్యకు ఎమ్మెల్యే శాలువా కప్పి అభినందించారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు పనుల ప్రారంభం
భూపాలపల్లి మండలంలోని కమలాపూర్‌లో మహాత్మాగాంధీ ఉపాధి హామీనిధులు రూ.50లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు. గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు.
శ్రీమహాసరస్వతీ శతక పుస్తకాన్ని
ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర
Comments
Please login to add a commentAdd a comment