ఇళ్లలోకి చొరబడి ప్రజలను భయపెడుతున్న ఆగంతకుడు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం, పలుగుల, కుంట్లం, అన్నారం గ్రామాల్లో ఓ ఆగంతకుడు వారం రోజుల నుంచి ఇళ్లలోకి చొరబడుతున్నాడు. రాత్రి సమయాల్లో తలుపులు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఒకసారి అర్ధనగ్నంగా, మరోసారి చొక్కా, నెక్కరు ధరించి రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాడు. ఒంటరిగా వెళ్తే దాడి చేసేందుకు వస్తున్నాడని వాహనదారులు తెలిపారు. మంగళవారం కాళేశ్వరం ఎస్టీకాలనీలో ఓ ఇంట్లోకి ప్రవేశించగా యజమాని సీసీ కెమెరాల్లో చూసి వెంటనే అప్రమత్తం కావడంతో పరారయ్యాడు. అలాగే, రెండు రోజులు క్రితం అన్నారంలో ఓ ఇంట్లోకి వెళ్లగా వారు దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని విచారించి తమిళనాడుకు చెందిన భాస్కర్‌గా గుర్తించారు. ఈవిషయమై కాళేశ్వరం ఎస్సై చక్రపాణిని సంప్రదించగా అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని, త్వరలో ఇక్కడి నుంచి పంపిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment