ఎలికేశ్వరంలో టెన్షన్ టెన్షన్
కాళేశ్వరం: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా ఐదు మండలాలకు సాగు, తాగు నీరందించే ప్రాజెక్టు కెనాల్ పనుల్లో భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని పనులు అడ్డుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎటూ తేల్చకపోవడంతో ఎలికేశ్వరం గ్రామంలో ని ర్వాసిత రైతులు ఆందోళన చేస్తూ జేసీబీ, ఇతర యంత్రాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. బు ధవారం ఎలికేశ్వరం గ్రామంలో రైతులను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పలువురు రైతులు వాహనాలు అడ్డుపడుకొని ఆందోళనకు దిగారు. రాళ్లబండి కమలక్క అనే మహిళ తన 1.15ఎకరాల భూ మిలో జేసీబీతో పనులు చేస్తుండగా పురుగుల మందుతాగింది. అయితే మహిళా పోలీసులు కమలక్క ను అడ్డుకుని ఈడ్చుకుంటూ, కొడుతూ పోలీ సు వా హనంలో తీసుకెళ్లారని ఆమె కుటుంబ సభ్యులు ఆ రోపిస్తున్నారు. మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి అక్కడి నుంచి భూపాలపల్లి ఆస్పత్రికి క మలక్కను తరలించారు. మహదేవపూర్ తహసీల్ధా ర్ ప్రహ్లాద్ రాథోడ్ ఆస్పత్రికి చేరుకొని కమలక్క ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కలెక్టర్‌తో మాట్లా డి న్యాయం చేస్తామన్నారు. కుటుంబ సభ్యులు త హసీల్ధార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టగా.. పోలీసులు వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
నిర్వాసితుల హౌస్ అరెస్టు
సీఐ రామచంద్రారావు, ఎస్సైలు పవన్‌కుమార్, చక్రపాణి, తమాషారెడ్డి ఇతర పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులను తెల్లవారుజాము నుంచి హౌస్ అరెస్టు చేశారు. ఎలికేశ్వరంలో అక్కడక్కడా పోలీసుల పికెటింగ్ చేపట్టారు. పొలాల్లో పనులు చేస్తుండగా పోలీసులు వలయంగా మారి రక్షణ కల్పించారు. వారితో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.
అసలు విషయం ఇలా..
2008 సెప్టెంబర్‌లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి చిన్నకాళేశ్వరానికి రూ.499కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి అడపాదడపా పనులు జరిగాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో నిధులు కేటాయించినా పనులు జరగలేదు. ప్రస్తుతం ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రత్యేక దృష్టిసారించడంతో పనులు చకాచకా జరుగుతున్నాయి. దీంతో భూసేకరణ సమస్య తెరపైకి వచ్చింది. ప్రాజెక్టులో భాగంగా మహదేవపూర్ మండలం మందరం చెరు వు నుంచి ఎలికేశ్వరం వరకు మెయిన్ కాల్వనిర్మా ణం చేపట్టారు. ఆరు కిలోమీటర్లతో 20–12 మీటర్ల వెడల్పుతో మహదేవపూర్, బొమ్మాపూర్, ఎలికేశ్వరం ముక్తపూర్, రాపల్లికోట, ఏన్కపల్లి గ్రామాల శివారు పంట భూముల గుండా నిర్మాణం కానుంది. అయితే 2011–12లో 166, 167, 169 సర్వే నంబర్లలోని 14.02 ఎకరాల భూమిలో 4 ఎకరాల రైతులకు పరిహారం అప్పటి ధర ప్రకారం చెల్లించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మిగితా 10 ఎకరాల్లోని రైతులు తమకు 2013 భూసేకరణ చట్టం కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఇచ్చిన ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం గతంలో పొరంబోకు భూమికాగా.. ఇప్పుడు రైతులు సాగు చేస్తున్నారని వారికి పట్టా, ధరణి కూడా వచ్చిందని, పరిహారం చెల్లించలేమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మహదేవపూర్ రెవెన్యూ అధికారులు 60–70 ఎకరాలు అని, ఇరిగేషన్ అధికారులు 110 ఎకరాలు కోల్పోతున్నట్లు చెప్పడం గమనార్హం.
రైతుల రిపోర్టు పంపిస్తాం
ఎలికేశ్వరం వద్ద కాస్తులో ఉన్న రైతుల రిపోర్టు కలెక్టర్‌కు పంపిస్తాం. న్యాయం చేస్తాం. ఆందోళ న చెందవద్దు. ఎలాంటి గొడవలకు దిగొద్దు.
– ప్రహ్లాద్ రాథోడ్,
తహసీల్దార్, మహదేవపూర్
కాల్వ పనులను అడ్డుకున్న భూనిర్వాసితులు
పరిహారం చెల్లించాలని డిమాండ్
మనస్తాపంతో
మహిళ ఆత్మహత్యాయత్నం
భూనిర్వాసితులను
హౌస్ అరెస్టు చేసిన పోలీసులు
పోలీసుల పహారాలో
పనులు చేపట్టిన అధికారులు
పరిణామాలపై కలెక్టర్ సమీక్ష
చిన్న కాళేశ్వరంలో జరుగుతున్న పరిణామాలపై ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ ఇతర రెవెన్యూ అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. భూముల్లో ప్రస్తుతం పనులకు ట్రెంచ్ మాత్రం వేసి రెడ్‌ప్లాగ్‌లు వేశారు. భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందవద్దని, గ్రామసభల తర్వాతనే పనులు ప్రారంభమవుతాయని బొమ్మాపూర్, ఎలికేశ్వరం రైతులతో కలెక్టర్ చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment