అజ్ఞాతం వీడి జన జీవనంలో కలవాలి
భూపాలపల్లి: మావోయిస్టులు అజ్ఞాతాన్ని వీడి జన జీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు. 30ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న భూపాలపల్లి మండలం పంబాపూర్ గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మచ్చ సోమయ్య కుటుంబాన్ని సందర్శించారు. ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్లు, నిత్యావసర సరుకులు అందజేశారు. వారితో మాట్లాడి కుటుంబ నేపధ్యం, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. సోమయ్య అడవి వీడి జనంలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోతే ఆయనపై ఉన్న రివార్డు, ప్రభుత్వ నుంచి అనేక ప్రయోజనాలు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, భూపాలపల్లి డీఎస్పీ ఎ.సంపత్‌రావు పాల్గొన్నారు.
ఎస్పీ కిరణ్ ఖరే
Comments
Please login to add a commentAdd a comment